రాష్ట్రంలో కరోనా మరణాల్లో గుంటూరు రెండోస్థానంలో ఉండగా...చిత్తూరు మెుదటి స్థానంలో ఉంది . జిల్లాలో కొత్తగా 131 కేసులు నమోదవ్వగా... మెుత్తం బాధితుల సంఖ్య 71వేల 897కు చేరుకుంది. కొవిడ్ కారణంగా జిల్లాలో మరొకరు మృతి చెందాగా... మెుత్తం మరణించిన వారి సంఖ్య 643కి పెరిగింది. ఇప్పటి వరకు కొలుకున్న వారి సంఖ్య 69,560గా ఉంది.
జిల్లాలో కొత్త కేసులు:
- గుంటూరు నగర పరిధిలో 38
- మంగళగిరిలో 13,
- కొల్లూరులో 7 ,
- బాపట్లలో 6 ,
- పెదకూరపాడులో 5 నమోదయ్యాయి.