పీసీసీ కార్యదర్శి పక్కాల సూరిబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసీసీ కార్యదర్శి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పక్కాల సూరిబాబు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అధిక సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అన్నారు.రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 135 సీట్లు బడుగు, బలహీన, మైనార్టీ, మహిళలకు కాంగ్రెస్ పార్టీ కేటాయించిందని పీసీసీ కార్యదర్శి పక్కాల సూరిబాబు వెల్లడించారు. సత్తెనపల్లి, వినుకొండ,నరసరావుపేట నియోజకవర్గాల్లో యువతకు అవకాశం కల్పించామని తెలిపిన ఆయన.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ప్రతి పేదవానికి 6 వేల రూపాయల నగదు, ప్రత్యేక హోదా అంశాలే తమ గెలుపుకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.