ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్యలుంటే వార్డు సచివాలయ కార్యదర్శిని కలవండి' - గుంటూరు వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనీఖీలు

గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ నగరంలోని వార్డు సచివాలయాల్లో ఆకస్మికంగా తనీఖీలు చేపట్టారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం... ప్రజలు వార్డు సచివాలయాల్లోని పరిపాలన కార్యదర్శిని సంప్రదించాలని తెలిపారు.

guntur commissioner checked ward secretariats
వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనీఖీలు చేపట్టిన కమిషనర్ అనురాధ

By

Published : May 14, 2020, 9:46 AM IST

స్థానిక సమస్యల పరిష్కారం కోసం... ప్రజలు వారు నివసించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల్లోని పరిపాలన కార్యదర్శిని సంప్రదించాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ తెలియజేశారు. తన పర్యటనలో భాగంగా నగరంలోని 22, 27వ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

సచివాలయ ఉద్యోగులు నిర్దేశిత సమయానికి ఆఫీస్​కు వస్తున్నారా లేదా అని రిజిస్టర్లను తనిఖీ చేశారు. సెక్రెటరీలు, వాలంటీర్లు నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా ప్రజలకు సేవలను అందించాలని కమిషనర్ కోరారు.

ప్రభుత్వం అందించే సేవలు, ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను గ్రామ వార్డు సచివాలయం డాష్ బోర్డ్​లోని నిర్దేశిత గడువులోపు పరిష్కరించేలా చూడాలని పరిపాలన కార్యదర్శికి ఆదేశించారు. నగర ప్రజలు.. నగర పాలక సంస్థ, మీ సేవ ద్వారా పొందే సేవల నిమిత్తం సంబంధిత వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

మరింత కఠినంగా లాక్​డౌన్: కలెక్టర్ శామ్యూల్

ABOUT THE AUTHOR

...view details