గుంటూరు సంపత్ నగర్లో బ్లీచింగ్ బదులు మైదా పిండి చల్లుతున్నారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సంచులు లేక బ్లీచింగ్ పౌడర్‌ను మైదా పిండి సంచుల్లో ప్యాక్ చేసి.. వీధుల్లో చల్లిస్తున్నామని వివరించారు.
'మేం చల్లుతున్నది మైదా కాదు.. బ్లీచింగ్ పౌడరే' - గుంటూరులో బ్లీచింగ్ పౌడర్ వివాదం
గుంటూరు సంపత్ నగర్లో తాము చల్లిస్తున్నది బ్లీచింగ్ పౌడరే అని, మైదా పిండి కాదని.. నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. కొందరు కావాలనే పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చల్లా అనురాధ, గుంటూరు కమిషనర్
స్థానికుల అనుమానం నివృత్తి చేసేందుకు సంచుల్లోని పౌడర్‌ను పరీక్ష చేయించామన్నారు. ఈ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో నిత్యం ప్రజల కోసం శ్రమిస్తున్న వారిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు.
ఇవీ చదవండి... 'పనులు లేకుండా పోయాయి.. మమ్మల్ని ఆదుకోండి'