60 సంవత్సరాల పైబడి కోమ్ ఆర్బిడిటిస్ (దీర్ఘకాలిక వ్యాధులు) ఉన్న వారికి పల్స్ ఆక్సీమీటర్ పరీక్షలు, శరీర ఉష్ణోగ్రత పరీక్షలు వేగవంతం చేయాలని... గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ.. ఏఎన్ఎం, హెల్త్ సెక్రటరీలను ఆదేశించారు. గుంటూరు రైల్ పేటలోని 36వ వార్డ్ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్... ఆ ప్రాంతంలో డోర్ టు డోర్ సర్వేను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.
ప్రతి సచివాలయ పరిధిలో పల్స్ సర్వేకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తప్పనిసరిగా 60 ఏళ్లకు పైబడిన వారిని గుర్తించి వారికీ పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పల్స్, ఆక్సీజన్ స్థాయి, డిజిటల్ థర్మోమీటర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలన్నారు. పల్స్ అక్సీమీటర్తో ఆక్సిజన్ శాతాన్ని పరీక్షించి తేడాలు ఏమైనా గుర్తిస్తే వెంటనే మెడికల్ అధికారికి తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు.