గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. రోగులకు వైద్య సౌకర్యాలు కల్పించటంపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా పాజిటివ్ వచ్చినా ఎలాంటి లక్షణాలు లేనివారు.. స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడేవారి కోసం కొత్తగా కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 కొవిడ్ కేర్ కేంద్రాలుండగా.. వాటిని సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గుంటూరు నగరంలోని రైల్ మహాల్ని కొవిడ్ కేర్ కేంద్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, రైల్వే డీఆర్ఎం మోహనరాజ రైల్ మహాల్ని పరిశీలించారు.
కొవిడ్ కేర్ సెంటర్‌ని పరిశీలించిన కలెక్టర్ - collector vivek yadav visit covid care center news
గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న... కొవిడ్ కేర్ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. అవసరమైన సిబ్బందిని, వైద్య పరికరాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.
కొవిడ్ మొదటి దశలోనే అక్కడ రైల్వేశాఖ తరపున పడకలు ఏర్పాటు చేశారు. కానీ వాటి అవసరం రాలేదు. ఇప్పుడు గుంటూరు జీజీహెచ్‌లో పడకలు నిండుకోవటంతో పాటు, ఇతర ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలో జీజీహెచ్‌కు అత్యంత సమీపంలోనే ఉన్న రైల్ మహాల్‌ను కొవిడ్ కేర్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే స్వల్ప లక్షణాలు ఉన్నవారిని అక్కడ ఉంచొచ్చని అధికారులు భావిస్తున్నారు. అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు.
ఇదీ చదవండి:నమ్మకంతో భూములిస్తే రైతులను అవమానపరుస్తారా ?- జీవీఆర్ శాస్త్రి