విజయవాడలో స్వర్ణ ప్యాలెస్‌లోని కొవిడ్ కేర్ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగి 10మంది మరణించటంతో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల తనిఖీ చేసేందుకు అధికారుల బృందాన్ని నియమిస్తూ కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడ ఘటనతో గుంటూరు కలెక్టర్ కీలక నిర్ణయం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
విజయవాడలోని కార్పొరేట్ కోవిడ్ కేర్ కేంద్రంలో జరిగిన ప్రమాదంతో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్ కేర్ కేంద్రాల్లో భద్రతా చర్యలపై గుంటూరు కలెక్టర్ అత్యవసరంగా కమిటీని నియమించారు. వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
guntur collector
అగ్నిమాపకశాఖ అధికారితో పాటు, ఆరోగ్య శాఖ నుంచి ఒక అధికారి, ఆర్డీవో/తహశీల్దారు, సీఐ/ఎస్సై, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, పురపాలికలలో అసిస్టెంట్ ఇంజనీరు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయితీ సెక్రటరీలు కమిటీల్లో ఉంటారు. జిల్లాలోని వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఈనెల 10వ తేదీ సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ శామ్యూల్ సూచించారు.