ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలి: కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ - గుంటూరులో కరోనా కేసులు

గుంటూరు జీజీహెచ్ లో ప్లాస్మా సేకరణ కేంద్రాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రారంభించారు. ప్లాస్మా సేకరించేందుకు జీజీహెచ్, రెడ్ క్రాస్ తో పాటు 9 ల్యాబ్ లకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఒకరు ఇచ్చే ప్లాస్మా ఇద్దరి ప్రాణాలు రక్షించేందుకు ఉపయోగపడుతుందన్నారు.

guntur collector started plasma lab at GGH
గుంటూరు జీజీహెచ్ లో ప్లాస్మా సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

By

Published : Aug 11, 2020, 3:24 PM IST

కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు జీజీహెచ్​లో ప్లాస్మా సేకరణ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కొవిడ్ రోగుల మరణాలు తగ్గించే క్రమంలో ప్లాస్మా చికిత్సను గుంటూరు జీజీహెచ్, ఎన్.ఆర్.ఐ ఆసుపత్రుల్లో మొదలుపెట్టామని తెలిపారు.

ప్లాస్మా సేకరించేందుకు జీజీహెచ్, రెడ్ క్రాస్​తో పాటు 9 ల్యాబ్​లకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి 28-60 రోజుల మధ్యలో ప్లాస్మా సేకరిస్తామని చెప్పారు. ఒకరు ఇచ్చే ప్లాస్మా ఇద్దరి ప్రాణాలు రక్షించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఇక ఆసక్తి ఉంటే ఎవరైనా ఐఐటీలో సీటు కొట్టొచ్చు!

ABOUT THE AUTHOR

...view details