ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేట, కొటప్పకొండ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్,ఎమ్మెల్యే - గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పర్యాటన

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, కొటప్పకొండ ప్రాంతాల్లో కలెక్టర్ శ్యాముల్​ ఆనంద్ , ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. సీఎం వచ్చే అవకాశం ఉన్నందున్న భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు.

guntur collector samuel anand  visited narasaraopet and kotappakonda areas
నరసరావుపేట, కొటప్పకొండ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్,ఎమ్మెల్యే

By

Published : Jan 12, 2021, 11:45 AM IST

నరసరావుపేట, కొటప్పకొండ ప్రాంతాలలో గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ,ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం పర్యటించారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా జరగనున్న గోపూజ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మొదటగా నరసరావుపేటలోని కొడెల స్టేడియాన్ని సందర్శించారు. అనంతరం కొటప్పకొండ వద్ద స్థలపరిశీలన చేశారు.

ధర్మప్రచారంలో భాగంగా జనవరి 15వ తేదీన టీటీడీ ఆధ్వర్యంలో నరసరావుపేటలో కామధేనుపూజ కార్యక్రమం జరగనుంది.

ఇదీ చదవండి

ఆవుల అక్రమ తరలింపును అడ్డుకున్న 'శివశక్తి'

ABOUT THE AUTHOR

...view details