ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి ఎయిమ్స్​లో కలెక్టర్ శామ్యూల్ పర్యటన - మంగళగిరి ఎయిమ్స్​లో గుంటూరు కలెక్టర్ శామ్యూల్ పర్యటన

ప్రభుత్వ ఒప్పందం మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్​కు కల్పించాల్సిన మౌలిక వసతులను.. అధికారులతో కలిసి కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​కుమార్ పరిశీలించారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని అక్కడి సిబ్బంది కోరగా.. అవసరమైతే ట్రాక్టర్​ల ద్వారా నీటిని సరఫరా చేయాలని పురపాలక సంఘం కమిషనర్​ను ఆదేశించారు.

collector aiims visit
మంగళగిరి ఎయిమ్స్​లో కలెక్టర్

By

Published : Dec 24, 2020, 4:18 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్​లో మౌలిక వసతుల కల్పనను.. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​కుమార్ పరిశీలించారు. తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర సౌకర్యాలను.. ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. జాతీయ రహదారి వరకు నిర్మించే ప్రధాన రహదారి పనులను.. అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఎయిమ్స్ సీఈవో డాక్టర్ ముఖేష్ త్రిపాఠితో.. కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు.

ప్రభుత్వ ఒప్పందం మేరకు సంస్థకు ఇంకా పది ఎకరాలు అప్పగించాల్సి ఉన్నట్లు.. ఎయిమ్స్ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు 183 ఎకరాలు ఇవ్వగా.. మరో 10 ఎకరాలను వీలైనంత త్వరగా కేటాయించాలని కోరారు. ఎయిమ్స్​లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే ట్రాక్టర్​లతో నీటిని సరఫరా చేయాలని మంగళగిరి పురపాలక సంఘం కమిషనర్ హేమమాలిని రెడ్డిని శామ్యూల్​ ఆనంద్ కుమార్ ఆదేశించారు. ప్రధాన రహదారి మార్గంలో ఆర్చ్ నిర్మించాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details