ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లేఅవుట్ అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ - గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తాజా వార్తలు

గుంటూరులో పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి పెండింగ్​లో ఉన్న లేఅవుట్ అభివృద్ధి పనులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. అంతర్గత రోడ్లతోపాటు లేఅవుట్ అభివృద్ధి పనులను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

guntur collector samuel anand kumar visit  house sites
లే అవుట్ అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ శామ్యూల్

By

Published : Jun 21, 2020, 8:53 PM IST

గుంటూరులో పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి పెండింగ్​లో ఉన్న లేఅవుట్ అభివృద్ధి పనులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధతో కలిసి ఏటుకూరు, వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు వద్ద ఇళ్ల స్థలాలను పనులను పర్యవేక్షించారు. అంతర్గత రోడ్లతోపాటు లేఅవుట్ అభివృద్ధి పనులను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

ఏటుకూరులో 80 శాతం పనులు పూర్తయినందున.. మిగిలిన పనులు పూర్తిచేసి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. గుంటూరు పశ్చిమ మండలానికి లాల్ పురం, చౌడవరంలో ప్రతిపాదిత ఇళ్ల స్థలాల భూములను రైతుల నుంచి సేకరించాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details