గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కరోనాకు మందు ఉందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నా ఇంకా కచ్చితమైన మందు రాలేదు. కానీ SMS అనే మందుతో కరోనా రాకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఆయన చెబుతున్నారు.
- S సోషల్ డిస్టెన్స్.. అంటే భౌతిక దూరం ..
- M మాస్క్.. మాస్క్ని ధరించటం
- S శానిటైజేషన్... చేతులు ఎప్పుడూ పరిశుభ్రంగా కడుక్కోవటం.
ఇదే మన కలెక్టర్ చెప్పిన SMS మందు. ఇపుడున్న పరిస్థితుల్లో కరోనాకి మందు ఇదేనని.... ప్రజలంతా SMSని పాటిస్తే కరోనా దగ్గరికి రాదని చెప్తున్నారు. మరి మీరూ పాటించండి. ఆరోగ్యంగా ఉండండి.