ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ నిబంధనలతోనే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - గుంటూరులో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా పరిమిత సంఖ్యలో వేడుకలకు ప్రజలకు అనుమతించనున్నట్లు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఏ.ఎస్‌.దినేష్‌కుమార్ తెలిపారు.

guntur collector review
guntur collector review

By

Published : Jul 28, 2020, 12:40 AM IST

కరోనా మహమ్మారి ప్రభావం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపైనా పడింది. ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకించేందుకు పాఠశాల విద్యార్థులు, సామాన్య ప్రజలతో కార్యక్రమాలు ఘనంగా జరిగేవి. అయితే ఈ సారి మాత్రం వేడుకలను తిలకించే వారి సంఖ్య పరిమితం కానుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, బృంద నృత్యాలు ఇలా.. అన్నింటిలోనూ పరిమిత సంఖ్యలోనే కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఏ.ఎస్‌.దినేష్‌కుమార్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రగతి కార్యక్రమాలను తెలిపేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. దూరం నుంచే వాటిని తిలకించే విధంగా బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం, హాజరయ్యే వారి సంఖ్య ఇవన్నీ.. కోవిడ్‌19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జేసీ అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details