ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడిపై కలెక్టర్​ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో కలెక్టర్​ వివేక్​ యాదవ్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. రోగులకు అందించాల్సిన సేవలకు అవసరమైన ఏర్పాట్లు, కట్టడి చర్యలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

Guntur collector on corona
కరోనా కట్టడిపై కలెక్టర్​ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

By

Published : Apr 16, 2021, 7:01 AM IST

కరోనా నివారణకు పకడ్బందీగా అన్నిచర్యలు చేపట్టాలని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో నోడల్ అధికారులతో కలెక్టర్​ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పాజిటివ్ కేసుల పెరుగుదల, కాంటాక్టు ట్రేసింగ్, కొవిడ్ నిర్ధరణ పరీక్షలు, ట్రైయేజ్ సెంటర్లు, హోం ఐసోలేషన్, కంటైన్మెంట్ జోన్లు, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల లభ్యత, కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు.

ఇదీ చదవండి:జిల్లాలో రికార్డు స్థాయిలో 621 కరోనా కేసులు

జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్​ వారియర్స్​ నూరుశాతం వ్యాక్సిన్​ తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి సీసీకెమెరాల ద్వారా ఆస్పత్రుల్లో అందుతున్న సేవలను పరిశీలించి లోటుపాట్లు ఉంటే సరిచేయాలన్నారు. ఏరియా ఆస్పత్రులు, పీహెచ్​సీల్లోనూ ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివేక్ యాదవ్ కోరారు.

ఇదీ చదవండి:

కరోనా విలయం.. ఆ రాష్ట్రాల్లో దయనీయ ఘటనలు

ABOUT THE AUTHOR

...view details