ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అవి కరోనా లక్షణాలే.. అజాగ్రత్త వద్దు.. సమాచారం ఇవ్వండి' - గుంటూరు జిల్లా వార్తలు

ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వాలంటీర్‌, ఏఎన్‌ఎంలకు సమాచారం అందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. జ్వరం, పొడిదగ్గు, గొంతు నొప్పి ఉంటే అజాగ్రత్తగా వ్యవహరించొద్దని సూచించారు. అవే కరోనా లక్షణాలు అని ఆయన పేర్కొన్నారు.

guntur collector
guntur collector

By

Published : Aug 5, 2020, 10:07 AM IST

ఎవరికైనా సరే వంద డిగ్రీలకుపైగా జ్వరం, పొడిదగ్గు, గొంతునొప్పితో బాధపడుతుంటే.. అవి కరోనా లక్షణం కావచ్చు. వెంటనే వాలంటీర్‌, ఏఎన్‌ఎంలకు సమాచారం అందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ కోరారు. వారి ద్వారా స్థానిక వైద్యాధికారుల నుంచి వైద్య సలహాలు తీసుకోవాలని తెలిపారు. డాక్టర్ల సూచనలు, సలహాల మేరకు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరిస్థితిని పరిశీలించి హోంఐసోలేషన్ , కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు , కొవిడ్‌–19 ఆసుపత్రులకు పంపిస్తారని అన్నారు. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మునిసిపల్, రెవెన్యూ , పంచాయతీ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజలు ముఖ్యంగా మాస్క్‌ ధరించటం, భౌతిక దూరం పాటించటం, తరచూ చేతులు శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రపరుచుకోవటం ద్వారా కరోనా వైరస్‌ సోకకుండా రక్షణ పొందవచ్చని కలెక్టర్‌ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details