పాజిటివ్ వ్యక్తుల కాంటాక్టులను గుర్తింపును వేగవంతం చేసేందుకు సచివాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని శంకరన్ హాలులో నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. అన్‌లాక్-2 నుంచి నగరంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని.. ఈ క్రమంలో పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు వార్డు సచివాలయ పరిధిలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, మహిళా పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.
సచివాలయాల్లోని బృందాలన్నీ ఎంఎస్‌ఎస్ యాప్‌తో అనుసంధానిస్తున్నామని.. పాజిటివ్ కేసు వచ్చిన వెంటనే సంబంధిత సచివాలయ బృందాలకు సమాచారం అందుతుందన్నారు. వారు ఆయా కేసుకు సంబంధించిన వివరాలు యాప్‌లో నమోదు చేయాలన్నారు.