గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దృష్ట్యా సర్వైలెన్స్, కంటైన్మెంట్ స్ట్రాటజీని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన...గ్రామీణ ప్రాంతాలలో నాలుగు పాజిటివ్ కేసులకన్నా ఎక్కువ నమోదైతే కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించాలన్నారు. ఆ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను పూర్తిగా నియంత్రించేలా చూడాలన్నారు.
కంటైన్మెంట్ జోన్లలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించేందుకు సచివాలయ ఉద్యోగులందరితో సర్వైలెన్స్ చేయించి పూర్తిగా శానిటేషన్ చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారిని, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.