ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్​ను త్వరగా వినియోగంలోకి తేవాలి: కలెక్టర్ - guntur collector latest news

నరసరావుపేటలో నూతనంగా జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో నిర్మాణమవుతున్న కొవిడ్ కేర్ సెంటర్​ను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచించారు. ఈ మేరకు జరుగుతున్న పనులను పరిశీలించారు.

guntur collector
covid center at narasaraopet

By

Published : May 29, 2021, 9:54 PM IST

నరసరావుపేటలో నూతనంగా జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో నిర్మాణమవుతున్న 50 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి కొవిడ్ కేర్ సెంటర్ ను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అంతకుముందు లింగంగుంట్ల వద్దనున్న 200 పడకల ప్రభుత్వ కొవిడ్ వైద్యశాల వద్ద లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఆయన సందర్శించారు.

ABOUT THE AUTHOR

...view details