ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్‌లు ఉంచే స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నాదెండ్ల మండలం గణపవరంలోని సీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఎన్నికల పోలింగ్ బాక్సులను గురువారం రాత్రి స్ట్రాంగ్ రూములను ఆయన పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులకు ఆయన సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించే వరకు ఇది కొనసాగుతుందన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు ఎంపీడీవోలు, తహసీల్దార్లు కలెక్టర్ వెంట ఉన్నారు.