నవరత్నాల పథకాల అమలుకు సేవలందించేలా వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై... గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. సమావేశంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 17550 మంది వాలంటీర్లు అవసరమని తెలిపారు. జులై 11 నుంచి ఇంటర్వ్యూల ప్రక్రియ మొదలుపెట్టి.. ఆగస్టు 15 నాటికి వాలంటీర్ల నియామకాలు పూర్తి చేయాలన్నారు. నియమ నిబంధనల ప్రకారం వాలంటీర్లను ఎంపిక చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఆగస్టు 15 నాటికి వాలంటీర్ల నియామకం - గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్
నిత్యం సమాజసేవ కోసం పాటుపడే వాలంటీర్లను నియమించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.
వాలంటీర్ల నియామకంపై గుంటూరు జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం