కరోనా విజృంభిస్తున్న సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కొనియాడారు. కరోనాపై పోరాడాతున్న పారిశుద్ద్య కార్మికులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ పాల్గొన్నారు.
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి' - 'పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి'
కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవల వెలకట్టలేనివని గుంటూరు కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కొనియాడారు. వారి సేలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు పూలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు నిస్వార్ధంగా ప్రాణాలు పణంగా పెట్టి రేయింబవళ్లు సేవలు చేస్తున్నారన్నారు. వారి సేవలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు.
TAGGED:
sanitary workers