గుంటూరు జిల్లాలోని శాంతి భద్రతలను కాపాడటం తమ కర్తవ్యమని..ఎవరైనా వాటికి విఘాతం కలిగించేలా కార్యక్రమాలు చేపడితే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. అధికారులను నిర్భందించటం, పోలీసులను దుర్భాషలాడటం, ప్రజాప్రతినిధులపై దాడులు చేయటం ఏ విధంగా శాంతియుత ఆందోళనలో అర్థం కావటం లేదన్నారు. హైకోర్టు సూచనల మేరకు శాంతిభద్రతలకు ఆటంకం కల్పిస్తే చర్యలు తప్పవన్నారు.
'శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు' - శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న గుంటూరు కలెక్టర్ శామ్యూల్
శాంతియుతంగా చేపట్టే ఆందోళనలకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, దాడులకు దిగబడితే మాత్రం చర్యలు తీసుకుంటామని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ చెప్పారు. శాంతిభద్రతల విషయంపై గుంటూరులోని కలెక్టరేట్‌లో ఆయన గ్రామీణ ఎస్పీతో చర్చించారు.
గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్