గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 319కి చేరింది. హాట్ స్పాట్ గా నమోదైన నరసరావుపేటలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేవలం గుంటూరు నగరంలోనే కేసుల సంఖ్య 146కు చేరింది. కేసులన్నీ కంటైన్మెంట్ జోన్లలోనే వస్తున్న నేపథ్యంలో త్వరలోనే వైరస్ వ్యాప్తిని త్వరలోనే నియంత్రిస్తామని జిల్లా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
'త్వరలోనే కరోనాను నియంత్రిస్తాం'
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. కేవలం నగరంలోనే 146 కేసులు నమోదవడం అధికారులను, స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని పరిస్థితులపై జిల్లా పాలనాధికారి శామ్యూల్ అధికారులతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు.
గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల
లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించి పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వలస కూలీల కోసం గ్రామాల్లో 10 నుంచి 20 పడకల క్వారంటైన్ కేంద్రాలను సిద్దం చేయాలని దూరదృశ్య సమీక్ష ద్వారా మండల అధికారులకు సూచించారు.
ఇదీచదవండి.