ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించండి' - కోరిటిపాడు పార్క్

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి వేగంగా చేపట్టాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ అధికార్ల ను ఆదేశించారు.కోరిటిపాడు పార్క్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, గ్రౌండ్ లో పెండింగ్ పనులను పరిశీలించారు

Guntur City Commissioner visits koritipadu park
గుంటూరు నగర కమిషనర్

By

Published : Sep 9, 2020, 12:16 PM IST

గుంటూరు శ్యామలా నగర్, రాజీవ్ గాంధీ నగర్, స్తంభాల గరువు, మారుతీ నగర్ తదితర ప్రాంతాల్లో గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ పర్యటించారు. కోరిటిపాడు పార్క్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, గ్రౌండ్​లో పెండింగ్ పనులను పరిశీలించారు. పార్క్ అభివృద్ధికి స్థానికంగా ఉన్న వారు ఓ కమిటీగా ఏర్పడి పార్క్ బాధ్యతలను చూడాలని సూచించారు. అనంతరం మారుతీ నగర్​లోని రామిశెట్టి రామారావు ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన తరగతి గదులను.. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న యూనిఫారం, బ్యాగ్లు పుస్తకాలను చూశారు. విద్యార్థుల సంఖ్య, పాఠశాలలో ఇతర అంశాలను గూర్చి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తీ చేయాలని సంబంధిత అధికారాలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details