కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు తక్కువ మందితో జరుపుకోవాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. ఎకో గణపతి విగ్రహాలనే వినియోగించాలని ప్రజలను కోరారు.
గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జె.సి.ఐ. గుంటూరు గూగుల్ స్వచ్చంద సంస్థ రూపొందించిన "మట్టి గణపతే.. మహా గణపతి" అనే పోస్టర్ ని ఆవిష్కరించారు. జె.సి.ఐ. గుంటూరు గూగుల్ స్వచ్చంద సంస్థ మట్టితో తయారు చేసిన మట్టి విగ్రహాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు.