"అమరావతే రాజధాని అని మోదీ ప్రకటించాలి" - ap capital city amaravathi news
గుంటూరు చంద్రమౌళీనగర్ జేఏసీ ఆధ్వర్యంలో రాజధానికి వ్యతిరేకంగా తీసుకున్న చట్టాలకు సంబంధించి ప్రతులను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు దగ్ధం చేశారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ... రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరు చంద్రమౌళీనగర్ జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ధర్నా చేశారు. రాజధానికి వ్యతిరేకంగా తీసుకున్న చట్టాలకు సంబంధించిన ప్రతులను దగ్ధం చేశారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోదీ.. రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా మూర్ఖత్వం, భాజపా ద్వంద్వ విధానాలను రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తున్నారని కేంద్రం గమనించాలని అన్నారు. అయోధ్యలో ఈ నెల 5న శంకుస్థాపన చేసేలోగా స్పష్టమైన ప్రకటన చేయాలని.. లేకుంటే ఆంధ్ర రాష్ట్రంలో భాజపాకు భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రజల తలరాతలను తల్లకిందులు చేస్తూ ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించారన్నారు. తక్షణం ప్రభుత్వం రాజధానికి వ్యతిరేకంగా చేసిన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.