గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో కాపూరి రకం తమలపాకుల సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ నుంచి దేశం నలుమూలలకు తమలపాకులు ఎగుమతి అవుతుంటాయి. పంట అల్లుకు వచ్చిన తర్వాత 25 రోజులకు ఒకసారి ఆకులు మొత్తం కోసి మార్కెట్కు తరలిస్తుంటారు రైతులు.
కరోనా ప్రభావంతో ఎగుమతులు లేక రైతులు ఆకులు కోయటంలేదు. అవి పాదునే ముదిరిపోతున్నాయి. కొంతమంది రైతులు ఏంచేయలేని పరిస్థితుల్లో ఆకులు కోసి అక్కడే పారబోస్తున్నారు. పొన్నూరు, చింతలపూడి, ములుకుదురు ఆలూరు తదితర గ్రామాల్లో గతంలో రెండు వేల ఎకరాల్లో తమలపాకు సాగు చేసేవారు. కానీ పరిస్థితుల ప్రభావంతో ప్రస్తుతం సుమారు 800 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు.
ఎకరాకు రూ.50 వేలు చెల్లించి కౌలు చేస్తున్నాం. ఎగుమతులు లేక ఆకులు కోయలేకపోతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి.
-నాగరాజు, తమలపాకు సాగుచేస్తున్న రైతు