గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్సై కరీముల్లా ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు రంజాన్ మాసం సందర్భంగా నడిరోడ్డుపై నమాజ్ చేశారు. కరోనాపై పోరులో ఎండనక, వాననక శ్రమిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమ కష్టాన్ని చూసైనా.. ప్రజలెవరూ ఇళ్లలోనుంచి బయటకు రావద్దని పోలీసులు కోరుతున్నారు.
వృత్తి పట్ల మీ నిబద్ధతకు మా వందనం..! - asi doing namaj in lockdown duty in guntur
కరోనాపై పోరులో పోలీసులు నిరంతరం శ్రమిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గుంటూరు లాలాపేటలో ఓ ఏఎస్సై విధులు నిర్వహిస్తూనే.. రంజాన్ సందర్భంగా నడిరోడ్డుపైనే నమాజ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వృత్తి పట్ల అతని నిబద్ధతను తోటి సిబ్బంది ప్రశంసిస్తున్నారు.
వృత్తి పట్ల మీ నిబద్ధతకు మా వందనం..!
TAGGED:
asi namaz story in guntur