ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు అరెస్ట్​ - undefined

దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి మూడు వందల నగదు, ఒక హుండీ, ఆటోని స్వాధీనం చేసుకున్నారు.

ఆలయ దొంగలు
ఆలయ దొంగలు

By

Published : Nov 11, 2020, 3:32 PM IST

ఆలయాల్లో చోరీకి పాల్పడుతున్న ముగ్గురిని గుంటూరులోని అరండల్​పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు వందల నగదు, ఒక హుండీ, ఆటోని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమణ కుమార్ తెలిపారు. ఈనెల 5న అర్దరాత్రి సంజీవయ్యనగర్ 1/4 వ లైన్ లోని నాగేంద్ర స్వామి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు హుండీని, ఆలయం బయట ఉన్న ఆటోను దొంగిలించారు. ఆలయ నిర్వాహుకులు, ఆటో యజమాని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దీనిపై పోలీసులు విచారణ జరపగా చెన్నుపల్లి మధుబాబు అతని తమ్ముడు నాగరాజు వారి స్నేహితుడు మద్దిరాల ఐజాక్ దొంగతనం చేసినట్లు తెలిసిందన్నారు. నిందితులు హుండీని గుంటూరులోని కాకుమాను వారితోటలో అమ్మడానికి వెళుతన్న సమయంలో... నిఘా వేసి చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండీ...వంటనూనెల ధరలపై కరోనా ప్రభావం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details