గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని విట్టంరాజుపల్లి గ్రామ శివారులో నాగిరెడ్డి అనే రైతు పొలంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు. మృతుని ఎడమ చేతి పై ఎన్ఐఆర్ అని పచ్చబొట్టు, కుడి చేతికి రోల్డ్ గోల్డ్ చైన్ ఉన్నాయి.
Dead body : విట్టంరాజుపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి - VINUKONDA
గుంటూరు జిల్లా విట్టంరాజుపల్లి గ్రామ శివారులో నాగిరెడ్డి అనే రైతు పొలంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని ఎడమ చేతి పై ఎన్ఐఆర్ అని పచ్చబొట్టు, కుడి చేతికి రోల్డ్ గోల్డ్ చైన్ ఉన్నాయని, గళ్ల చొక్కా, నీలి రంగు నైట్ ప్యాంట్, సిమెంట్ కలర్ టోపీ ధరించి ఉన్నాడని సీఐ రమేష్ బాబు తెలిపారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
మృతుడు గళ్ల చొక్కా, నీలి రంగు నైట్ ప్యాంట్, సిమెంట్ కలర్ టోపీ ధరించి ఉన్నాడు. వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉండొచ్చని సీఐ తెలిపారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి:ఇంటి ఓనర్లను 'మత్తు'తో మోసగిస్తున్న కిలాడీ జంట.. పీడీ యాక్టు కింద కేసు