ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరేడు నెలల్లో ఇన్‌పేషెంట్‌ వైద్య సేవలు

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌కు రహదారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆస్పత్రి పాలక మండలి సమావేశం అభిప్రాయపడింది. మంగళవారం తొలిసారిగా ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన సమావేశంలో... పాలక మండలి సభ్యులైన ఎంపీలు బి.సత్యవతి, విజయసాయిరెడ్డిలు పాల్గొన్నారు. భూసేకరణ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రహదారి సమస్య పరిష్కరిస్తామని హామీఇచ్చారు. నీరు, విద్యుత్తు సమస్యలనూ తీరుస్తామని చెప్పారు. ఈ సమావేశానికి డాక్టర్‌ టీఎస్‌ రవికుమార్‌ అధ్యక్షత వహించారు.

Guntur AIIMS board meeting in mangalagiri
ఆరేడు నెలల్లో ఇన్‌పేషెంట్‌ వైద్య సేవలు

By

Published : Dec 18, 2019, 8:03 AM IST

ఆరేడు నెలల్లో ఇన్‌పేషెంట్‌ వైద్య సేవలు

పాలక మండలి ప్రధాన నిర్ణయాలు...
మంగళగిరి ఎయిమ్స్‌లో రానున్న ఆరేడు నెలల్లో ఇన్‌పేషెంట్‌ వైద్య సేవలు ప్రారంభించాలని పాలక మండలి భేటీలో తీర్మానించారు. అలాగే రూ.60కోట్లతో చేపట్టిన అత్యాధునిక కేన్సర్‌ బ్లాక్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. 2020 చివరి నాటికి ఆస్పత్రి ఆవరణలో అన్ని భవన నిర్మాణాలను పూర్తి చేయాలని, కోర్సు పూర్తిచేసిన మొదటి బ్యాచ్‌ విద్యార్థుల సేవలను క్లినికల్‌ విభాగాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి భవనాలు పూర్తయితేనే ఇక్కడే వైద్య విద్య తరగతులు బోధించాలని తీర్మానించారు.

ABOUT THE AUTHOR

...view details