గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావుకు పదోన్నతి లభించింది. శ్రీనివాసరావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989లో పోలీసు శాఖలో ఎస్ఐగా ఎంపిక కాబడి.. అంచలంచెలుగా ఎదిగి అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. 1989 బ్యాచ్లో ప్రత్తిపాడు మండలం నుండి నలుగురు ఎస్ఐలుగా ఎంపిక కాబడ్డారు. వారిలో ప్రత్తిపాడుకు చెందిన పులి సుబ్బారెడ్డి మరియు నిమ్మగడ్డవారిపాలెంకు చెందిన నిమ్మగడ్డ రామారావు గత సంవత్సరం డీఎస్పీలుగా పదవీవిరమణ చెందారు. మేడవారిపాలెంకు చెందిన కన్నెగంటి రమేష్ డీఎస్పీగా పని చేస్తున్నారు.
గుంటుపల్లి శ్రీనివాసరావుకు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి - పోలీసు శాఖ వార్తలు
Promotion to Guntupalli Srinivasa Rao: ఎస్ఐగా పోలీసు ఉద్యోగంలో చేరి.. అంచెలంచెలుగా ఎదిగారు గుంటుపల్లి శ్రీనివాసరావు. గొట్టిపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు 1989లో ఎస్ఐలో పోలీసు శాఖలో చేరారు. డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు తాజాగా అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు.
guntupalli srinivasa rao