భారీ వర్షాలతో కృష్ణానది నుంచి వస్తున్న వరద నేపథ్యంలో... గుంటూరు జిల్లాలోని నది పరివాహక ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. వరద నీటి ప్రవాహం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, సివిల్ సప్లయిస్, మున్సిపల్, విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్షించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వల్ల రానున్న రెండురోజుల్లో నాగర్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలే అవకాశం ఉందన్నారు. గురజాల, గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో కృష్ణానది వరద నీటి వల్ల ఇబ్బందుల రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూం ద్వారా వరద నీటి పరిస్ధితిపై హెచ్చరికలు జారీ చేయటం జరుగుతుందన్నారు. డివిజన్, మండల స్థాయిలోను ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలన్నారు.
- పునరావాస కేంద్రాలను సిద్ధం చేయండి..