ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజృంభిస్తోన్న కరోనా.. అధికార యంత్రాంగం అప్రమత్తం.. - ఏపీలో కరోనా కేసుల వార్తలు

రెడ్​జోన్లలో 3 నెలలపాటు ఎవరూ ఇంటి అద్దె అడగరాదని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ స్పష్టం చేశారు. ఎవరైనా ఇబ్బందిపెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 126 కేసులు నమోదయ్యాయని.. కరోనా వ్యాప్తి నివారణకు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు.

guntoor collector statement on house rents
guntoor collector statement on house rents

By

Published : Apr 19, 2020, 10:56 AM IST

గుంటూరు జిల్లాలో 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ తెలిపారు. సత్వర ఫలితాల కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. 18 ట్రూనాట్ మిషన్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. జీజీహెచ్ ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మారుస్తున్నామని ప్రకటించారు. 4 కేసులుంటేనే రెడ్ జోన్​గా ప్రకటిస్తామని అన్నారు. రెడ్​జోన్లలో గృహ యజమానులు 3 నెలలపాటు ఇంటి అద్దె అడగరాదని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details