తీర ప్రాంతంలో వేరుశనగ పంట వేల హెక్టార్లలో సాగవుతోంది.. అయితే పంట పండించే రైతులకు రాయితీ విత్తనం దక్కక రూ.కోట్లు నష్టపోతున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసిన విత్తనం నాణ్యత లేకపోవడం వల్ల దిగుబడులు లేక నష్టపోతున్నారు. సమస్య తీవ్రత నేపథ్యంలో గుంటూరు జిల్లా బాపట్లలోని ఏజీ కళాశాల క్షేత్రంలో రూ.60 లక్షల ఐసీఏఆర్ నిధులతో వేరుశనగ విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై దక్కనున్నాయి.
వేరుశనగ పంటను కర్లపాలెం, పిట్టలవానిపాలెం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లోని 5789 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 2010 వరకు 50 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలు ఏపీ సీడ్స్ ద్వారా ప్రభుత్వం అందజేసేది. ఆ తర్వాత ఏపీ సీడ్స్ చేతులెత్తేయడం వల్ల రాయితీపై విత్తనాల సరఫరా నిలిచిపోయింది. ఈ పంట సాగులో విత్తన వ్యయం ఎక్కువగా ఉంటుంది. విత్తనాల కొనుగోలుకే ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చవుతోంది. రాయితీ నిలిచిపోవడం వల్ల జిల్లాలో రైతులకు ఏటా రూ.3 కోట్ల పైన భారం పడుతోంది.
రైతులకు ఎంతో లాభం