GRMB Meeting Postponed : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వచ్చే నెలకు వాయిదా పడింది. గూడెం ఎత్తిపోతల, మొడికుంట వాగు, ప్రాజెక్టుల డీపీఆర్‌ల పరిశీలనతో పాటు.. ప్రాజెక్టులపై టెలిమెట్రీ ఏర్పాటు, పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు నేడు బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులో ఉన్న గోదావరి జలాలను ప్రత్యేక సంస్థతో లెక్కింపు చేయాలన్న ప్రతిపాదనను సమావేశ అజెండాలో పొందుపర్చారు. అందుకు అనుగుణంగా జీఆర్ఎంబీ సమావేశం జరగాల్సి ఉంది.
GRMB Meeting: నేడు జరగాల్సిన GRMB సమావేశం వాయిదా - GRMB Meeting latest news
GRMB Meeting Postponed : తెలంగాణలో నేడు జరగాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా పడింది. మాండౌస్ తుపాను నేపథ్యంలో సమావేశానికి రాలేమన్న రాష్ట్ర ఆధికారుల విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వచ్చే నెల 3కు వాయిదా వేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం అందించింది.
GRMB Meeting Postponed
అయితే మాండౌస్ తుపాను దృష్ట్యా అత్యవసర విధులు నిర్వర్తిస్తున్నామని.. ప్రస్తుతం సమావేశానికి రాలేమంటూ ఆంధ్రప్రదేశ్ అధికారులు గోదావరి బోర్డుకు సమాచారమిచ్చారు. భేటీని వాయిదా వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేసిన గోదావరి బోర్డు.. వచ్చే నెల 3న జరపనున్నట్లు రెండు రాష్ట్రాలకు సమాచారం అందించింది.
ఇవీ చూడండి..