బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి ప్రజాస్వామ్యం వచ్చిన రోజున అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నారాయణ మూర్తిని ఘనంగా సన్మానించారు. మార్కెట్లో 'ప్రజాస్వామ్యం' అనే చిత్రం త్వరలో విడుదల అవుతుందని... అందరూ ఆదరించాలని కోరారు. ప్రధానంగా ఇసుక విధానంపై కొన్ని అంశాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు, జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగలింగం పాల్గొన్నారు.
తెనాలిలో సినీ నటుడు ఆర్. నారాయణమూర్తికి సన్మానం - r narayana murthy sanmanam news in telugu
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలోనే ఉందని... ఆ ప్రజాస్వామ్యం బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి వచ్చినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నారాయణమూర్తిని ఘనంగా సన్మానించారు.
grand felicatation programme for r narayana murthy at thenali