గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో చిన్నజీయర్ స్వామి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి గ్రామీణ చైతన్య పథకం "ప్రగతి"ని ప్రారంభించారు. గ్రామంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు సోలార్ దీపాలు, ఇస్తరాకులు, టిఫిన్ ప్లేట్లు, గో ఆధారిత మందులు, నూనెలు, డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ వంటి యూనిట్లను ఏర్పాటు చేశారు.
గ్రామాల్లోని యువతీ, యువకులకు ఉపయోగపడేలా గ్రామీణ చైతన్య కార్యక్రమాన్ని స్వామీజీ ప్రారంభించటం హర్షణీయమని హోంమంత్రి అన్నారు. ఈ పథకం ద్వారా యువత తమ నైపుణ్యాలు మెరుగుపరచుకుని, స్వయం ఉపాధి పొందేలా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పారు. గో ఆధారిత వస్తువులు ఆరోగ్యానికి ఎంతో మంచిదని..వాటిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు.