రేపు తాడేపల్లి పురపాలక సిబ్బందికి కరోనా పరీక్షలు - గుంటూరు తాజా సమాచారం
తాడేపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో కొంతమందికి కొవిడ్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేపు పురపాలక సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
రేపు తాడేపల్లి పురపాలక సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా నాలుగు కేసుల మేర నమోదయ్యాయి. తాడేపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో కొంతమంది అధికారులకు కొవిడ్ సోకింది. దీంతో మంగళగిరి పురపాలక సంఘం కమిషనర్ హేమామాలినికి తాడేపల్లి బాధ్యతలను అప్పగించారు. ఆ సమయంలో హేమామాలినికి సమీపంలో ఉన్న ఓ ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో గురువారం సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.