రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ సరఫరా జనవరి 1 నుండి ప్రారంభమవుతుందని గురజాల అర్డీవో పార్థసారధి తెలిపారు. రేషన్ సరఫరా చేసేందుకు వాలంటీర్లు జీపీఎస్ ద్వారా గృహాలు మ్యాపింగ్ చేస్తున్నారన్నారు. మ్యాపింగ్ పూర్తయిన అనంతరం వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేయబడుతుందని తెలిపారు. మ్యాపింగ్ విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఇంకా 10 వేల రేషన్ కార్డులు మ్యాపింగ్ కావాల్సి ఉందన్నారు. ప్రజలు ముందుకు వచ్చి తమ రేషన్ కార్డుల వివరాలను వాలంటీర్ల ద్వారా నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. రేషన్ వినియోగదారులు తమ సమాచారాన్ని వీఆర్ఓలకు, వాలంటీర్లకు సకాలంలో అందజేయాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ సరఫరాను విజయవంతం చేయాలని కోరారు.
'ఇంటింటికి రేషన్ సరఫరాను విజయవంతం చేయండి' - Guntur District News
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ సరఫరాను విజయవంతం చేయాలని గురజాల ఆర్డీవో పార్థసారథి తెలిపారు. గురజాల డివిజన్లోని ప్రజలందరూ తమ రేషన్ కార్టులును వీఆర్ఓ, వాలంటీర్లకు ఇచ్చి మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు.
గురజాల ఆర్డీవో పార్థసారథి