ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు - corona cases in guntur dst'

రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరి, తాడేపల్లి పట్టణాలను పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ మంగళగిరి, తాడేపల్లిలో పర్యటించారు.

govt take measures to development of captial areas near to guntur
govt take measures to development of captial areas near to guntur

By

Published : May 8, 2020, 5:16 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి పట్టణాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. నేడు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఈ ప్రాంతాల్లో పర్యటించారు. మంగళగిరిలోని రత్నాల చెరువు, పెద్ద కోనేరు, పీఎంఏవై గృహసముదాయం, గాలిగోపురంతో పాటు తాడేపల్లిలోని ముఖ్య కూడళ్లను విజయ్ కుమార్ పరిశీలించారు.

ఈ రెండు పట్టణాలలో రహదారుల విస్తరణ, భూగర్భ డ్రైనేజ్, సుందరీకరణ, ఇతర మౌలిక వసతుల కోసం 15 వందల కోట్లు విడుదల చేస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరికి 800 కోట్లు, తాడేపల్లికి 700 కోట్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాదిలోపే ఈ రెండు మున్సిపాల్టీలను మోడల్ పట్టణాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

ఇదీ చూడండివిశాఖ గ్యాస్​ లీకేజీ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ నియామకం

ABOUT THE AUTHOR

...view details