- అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నరసింగరావు
- రేపు జిల్లా కేంద్రాలు, పరిశ్రమల వద్ద ఎస్మా జీవో కాపీలు దహనం: నరసింగరావు
- ఈ నెల 9న జైల్ భరో నిర్వహిస్తాం: కార్మిక సంఘాల నేతలు
- ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర బంద్ చేస్తాం: కార్మిక సంఘాల నేతలు
- లక్షా 4 వేల మంది మహిళలపై ఇలాంటి చర్యలు దుర్మార్గం: కార్మిక నేతలు
3.20 PM
- విజయవాడలో కార్మిక సంఘాల నేతల మీడియా సమావేశం
- పాల్గొన్న సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ నేతలు అంగన్వాడీలపై ఎస్మాను ఖండించిన కార్మిక సంఘాల నేతలు
- కార్మికులతో ఘర్షణ వైఖరి సరికాదు: కార్మిక సంఘాల నేతలు
- ప్రభుత్వ వైఖరి వల్ల 25 రోజులుగా సమ్మె: కార్మిక సంఘాల నేతలు
- నాలుగేళ్లుగా అన్ని వస్తువుల ధరలు పెరిగాయి: కార్మిక సంఘాల నేతలు
- ఇచ్చిన హామీ అమలుచేయాలనే అంగన్వాడీలు కోరుతున్నారు: నేతలు
- నాలుగు రోజులు చర్చించినా రూపాయి జీతం పెంచరా?: కార్మిక సంఘాల నేతలు
- కార్మికులు తిరగబడితే ఏమవుతుందో త్వరలో తెలుస్తుంది: సంఘాల నేతలు
- అంగన్వాడీల సమస్యను వెంటనే పరిష్కరించాలి: కార్మిక సంఘాల నేతలు
- లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం: కార్మిక సంఘాల నేతలు
1.39PM
- విజయవాడ ధర్నాచౌక్‌లో స్పృహతప్పి పడిన అంగన్వాడీ కార్మికురాలు
- నిరాహార దీక్ష శిబిరంలో స్పృహతప్పి పడిపోయిన అంగన్వాడీ కార్మికురాలు
- ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రేగులపాడు వాసిగా గుర్తింపు
1.16PM
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించటంను ఖండించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
- రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆగ్రహం
- ఎస్మా చట్టం ప్రయోగించడంను ఖండించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ
- సీఎం జగన్ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు: కే. రామకృష్ణ
- సిటింగ్ స్థానాలు మార్చినంత మాత్రాన కార్మికుల సమస్యలు పరిష్కారం కావు: కే. రామకృష్ణ
- కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవటం అసాధ్యం: కే. రామకృష్ణ
- ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ చర్యలను ఖండించాలని కోరుతున్నాం: కే. రామకృష్ణ
12.58PM