Govt Officials are worried about what will happen if government changes:పెద్దలు చెప్పినట్లు చేశాం..! అడ్డగోలు నిర్ణయాలను ఆమోదించాం...! మరి కొన్ని నెలల్లో ప్రభుత్వం మారితే పరిస్థితేంటి..? ఇదీ జగన్ సారథ్యంలో విర్రవీగిన కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల్లో అంతర్మథనం.చంద్రబాబుతో ఇబ్బంది ఉండకపోవచ్చేమోగానీ..లోకేశ్, ఇతర నేతలు ఊరుకునేలా లేరు. ప్రైవేటు సెక్టార్‌లో మంచి పోస్టేదైనా ఉంటే చూడు బాస్..! ఇదీ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న.. ఓ సీనియర్ అధికారి మరో ఐఏఎస్‌తో ఇటీవల అన్న మాటలు.! వీళ్లే కాదు.. అనేక మంది IASలకు ఇదే భయం పట్టుకుంది.
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే తమ గతేంటని కొందరు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా ఎలాంటి ఆధారాల్లేకపోయినా, ప్రతిపక్ష నాయకులపైనా, ప్రభుత్వానికి గిట్టని వారిపైనా... అక్రమ కేసులు బనాయించి, మానసికంగా, శారీరకంగా వేధించిన అధికారులు ఎక్కువ ఆందోళనచెందుతున్నట్టుసమాచారం. మట్టి దోపిడీ, భూముల కబ్జా, ఇసుక, గనులు.. వంటి అనేక అక్రమ వ్యవహారాలకు, అవినీతికి కార్యక్రమాలకు అడ్డగోలు నిర్ణయాలకు సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. స్వయంగా మేసేసిన అధికారుల మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. మాజీ సీఎం, మాజీ మంత్రులు సహా విపక్ష పార్టీ నాయకులపైనా, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైనా... అక్రమ కేసులు బనాయించి ఎలా వేధించవచ్చో జగన్ ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వం కేసు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే... అందుకు ఓ కారణం అవసరమే లేదన్నట్టుగా... ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ అధికారంలోకి వస్తే,.... వాళ్లూ జగన్ బాటలోనే కేసుల కొరడా ఝళిపిస్తే.. మొదట బలయ్యేది తామేననే విషయాన్ని గుర్తించిన అధికారులు ఇప్పుడు కలవరపడుతున్నారు.
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు టెన్త్ క్లాస్ స్టూడెంట్ పాఠాలు- యువ ప్రొఫెసర్‌గా రికార్డ్
అధికారం అండ చూసుకుని పలువురు అధికారులు.. ఇన్నాళ్లూ చెలరేగారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మారితే గడ్డుకాలమేనన్న అభిప్రాయం రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2019లో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్ పక్కన ప్రత్యక్షమై, అప్పటి నుంచి సీఎంఓలో చక్రం తిప్పుతున్న అధికారి, గతంలో సీఎంఓలో హల్‌చల్ చేసి, సహచర అధికారుల నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మరో అధికారి, గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి... ఏపీలో కీలక శాఖ నిర్వహిస్తున్న మరో అధికారి, గత ప్రభుత్వంలోనూ మూడు నాలుగు శాఖలకు ముఖ్యకార్యదర్శిగా పనిచేసి.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి, మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురిపై పెట్టిన అక్రమ కేసుల్లో వారికి ప్రతికూలంగా వాంగ్మూలం ఇచ్చిన ఉన్నతాధికారి, ఇలా పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మొదలు.. డీఎస్పీలు, సీఐల వరకూ ఉన్నారు. అనేక మంది ఆందోళనలో ఉన్నట్లు చెప్తున్నారు.
అండగా నిలిచి అడ్డంగా బుక్కైన అధికారుల పరిస్థితి ఏంటి ?
ఎక్కువ మంది ఐఏఎస్ అధికారుల్లో... అభద్రతాభావం ఉంది. నేతల ప్రోద్భలంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అధికారులు ప్రభుత్వం మారితే, దోషులుగా నిలబడాల్సి వస్తుందన్న భయం వారిలో కనిపిస్తుంది. వారు ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎవరి ఒత్తిడి మేరకు.. నిధులు విడుదల చేశారు..? లాంటి అనేక వివరాలు, ఆధారాల్ని జాగ్రత్త చేసుకుంటున్నారని... ఒక అధికారి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారినా, మారకపోయినా... మరికొందరు అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. అధికార పార్టీ పెద్దల అరాచకాలు, అక్రమాలకు అన్ని విధాలా సహకరిస్తూ... ఆ రొంపిలో పూర్తిగా కూరుకుపోయిన.. ఒకరిద్దరు మాత్రం నిండా మునిగాక చలేంటనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఐఏఎస్ స్థాయికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు - జగన్నాటకంలో తమ వంతు పాత్ర పోషణ
అప్పుడు అడ్డగోలు నిర్ణయాలను ఆమోదించారు - ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు