గుంటూరు జిల్లా నరసరావుపేటలోని పలు వార్డుల్లో ప్రభుత్వం కూరగాయల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో అధికారులు నిర్ణయించిన ధరల కన్నా అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల వ్యాపారస్తులు అధిక ధరలకు అమ్ముతున్నారంటున్నారు. వ్యాపారుల దురుసు ప్రవర్తనతో వాలంటీర్లు సైతం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు.
ఈ విషయంపై నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ వ్యాపారస్తులను ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఆయన పరిశీలించిన సమయంలో నిర్ణయించిన ధరలకు అమ్మడం... అనంతరం తిరిగి అధిక ధరలకు విక్రయించటం యథావిధిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో అధిక ధరలు మరింత ఇబ్బందిగా మారాయంటున్నారు. ఈ కేంద్రాలకు వెల్లడం మానుకుంటున్నారు. ఫలితంగా.. కొన్ని చోట్ల మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.