ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ పాలన అందిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను.. కార్పోరేట్ ఆస్పత్రులకు అనుసంధానం చేస్తామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
'వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన' - వైఎస్సార్ పుట్టిన రోజు వేడుకలు
ప్రజలందరికీ వైద్యం, విద్య అందిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. వైఎస్సార్ అశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు.
'వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి పాలన'