రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు... గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. తొలుత శ్రీ పానకాల స్వామి ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి నాలుగు బిందెల పానకాన్ని సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లి... ధ్వజ స్థంభానికి మెుక్కి... పూజలు చేశారు. ఆలయ సిబ్బంది గవర్నర్ దంపతులకు లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని అందించారు.
పానకాల స్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు - రాష్ట్ర గవర్నర్ నరసింహన్
మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ దంపతులు దర్శించుకుని... మెుక్కులు చెల్లించారు.
పానకాల స్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు