గ్రామాల అభివృద్ధికి ఉన్నత విద్య దోహదపడాలని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. గుంటూరు నాగార్జున వర్సిటీలో జరిగిన ఉప కులపతుల సదస్సులో గవర్నర్ పాల్గొన్నారు. గ్రామీణ జీవితంతో ముడిపడి ఉన్న కోర్సులు రావాలని బిశ్వభూషణ్ సూచించారు. గ్రామాల అభివృద్ధి పాలకుల లక్ష్యం కావాలని... ప్రస్తుతం మోదీ ఆ దిశగానే కృషి చేస్తున్నారని తెలిపారు. మోదీ స్వచ్ఛ భారత్ నినాదం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు.
గ్రామాల అభివృద్ధికి ఉన్నత విద్య దోహదపడాలి: గవర్నర్ - విద్యపై గవర్నర్ భిశ్వభూషణ్
గుంటూరు నాగార్జున వర్సిటీలో జరిగిన ఉపకులపతుల సదస్సులో గవర్నర్ బిశ్వభూషణ్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ఉన్నత విద్య దోహదపడాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
ఉపకులపతుల సదస్సులో గవర్నర్