Governor: అమరావతి రాజధాని పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించేదుకు రాజ్‌భవన్ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు వైకాపా ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. రాజధాని ప్రాంతంలోని వారికే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చట్ట సవరణ చేశారు. ప్రత్యేక అధికారి స్థాయిలో కూడా కేటాంపుల నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయాన్ని అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం... తామిచ్చిన భూములను ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో హైకోర్టు కొట్టేయడంతో ఇటీవలే ప్రభుత్వం మళ్లీ చట్టసవరణ చేసింది. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ చేశారు.
అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణలకు గవర్నర్ ఆమోదం
Governor: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు రాజధాని అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఉద్దేశించిన చట్టసవరణలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదించారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.
గవర్నర్