అమూల్ కోసం ప్రభుత్వం ఎందుకు తహతహలాడుతోందని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. మౌలిక వసతుల కోసం అమూల్‌కు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తారా..? అని నిలదీశారు. విజయాకు కాకుండా అమూల్‌కు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ప్రశ్నించారు. గుజరాత్ వ్యవస్థల కోసం ప్రభుత్వం పనిచేయడం ఆశ్చర్యం వేస్తోందని ధూళిపాళ్ల పేర్కొన్నారు.
జగన్.. ఏపీకి ముఖ్యమంత్రా..? గుజరాత్‌కు ముఖ్యమంత్రా..? అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. సబర్‌కాంతా యూనియన్ గుజరాత్‌లో పాలసేకరణకు రూ.730 ఇస్తోందన్న ధూళిపాళ్ల... అమూల్‌కు చెందిన అదే యూనియన్ ఏపీలో రూ.650 ఇవ్వడం ఏంటని నిలదీశారు. రాష్ట్రంలోని సహకార వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.