ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రూప్​ ఇన్స్యూరెన్స్​ ప్రీమియం తీసుకుంటున్నా బాండ్లు ఇవ్వని ప్రభుత్వం - AP Secretariat Information

Government that takes insurance premium but does not issue bonds: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేశాక వారి ప్రొబేషన్‌ను జులైలో ఖరారు చేసారు.. అప్పటి నుంచి వారి జీతం నుంచి జీవిత బీమా కింద నెలకు 850 రూపాయలు చొప్పున మినహాయించుకుంటున్నారు కాని బాండ్లు మాత్రం జారీ చేయడంలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు.

Government that takes insurance premium but does not issue bonds
బృంద జీవిత బీమా ప్రీమియం తీసుకుంటున్నా బాండ్లు ఇవ్వని ప్రభుత్వం

By

Published : Dec 19, 2022, 7:40 AM IST

Updated : Dec 19, 2022, 8:43 AM IST

Government that takes insurance premium but does not issue bonds: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి ప్రతినెలా బృంద జీవిత బీమా ప్రీమియంగా తీసుకుంటున్న ప్రభుత్వం వారికి బాండ్లు మాత్రం జారీ చేయడంలేదు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసిన ఉద్యోగుల ప్రొబేషన్‌ను జులైలో ఖరారు చేశాక.. ఒక్కొక్కరి జీతం నుంచి జీవిత బీమా కింద నెలకు 850 రూపాయలు చొప్పున మినహాయించుకుంటున్నారు. ఇలా అయిదు నెలల్లో ఉద్యోగుల నుంచి రూ.34 కోట్లు తీసుకున్నారు. ఇప్పటికీ బాండ్లు మాత్రం జారీ చేయలేదు. ఈ అయిదు నెలల వ్యవధిలో పది మంది మృతి చెందారు. తాము ఎవర్ని సంప్రదించాలో తెలియడం లేదని బాధిత కుటుంబాల సభ్యులు వాపోతున్నారు. సచివాలయాల శాఖ అధికారులను సంప్రదిస్తే... తమకు సంబంధం లేనట్లుగా చెబుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు.

బృంద జీవిత బీమా ప్రీమియం తీసుకుంటున్నా బాండ్లు ఇవ్వని ప్రభుత్వం
Last Updated : Dec 19, 2022, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details